స్ఫూర్తి: లాక్ డౌన్ టైం లో వినూత్న ఆలోచన.. కట్ చేస్తే ఇప్పుడు నెలకి ఎనభై వేలు..!

-

జీవితంలో అనుకున్నంత మాత్రాన ప్రతి ఒక్కరూ సక్సెస్ కాలేరు. ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొంటే కానీ ఆఖరికి అనుకున్నది సాధించలేము. పైగా చాలామంది ఆడవాళ్లు జీవితంలో ఎన్నో కలల్ని కంటారు. కానీ పెళ్లి తర్వాత అవన్నీ కూడా కుప్పకూలిపోతాయి గృహిణులూ మీరు కూడా ఏదో ఒకటి చేయాలని చేయలేకపోతున్నారా..? సక్సెస్ ని పొందాలని అనుకుంటున్నా పొందలేకపోతున్నారా..? అయితే కచ్చితంగా మీరు ఈమె సక్సెస్ స్టోరీ ని చూడాలి.

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలోని రేసవు వాని పాలెం లోని ఒక మహిళ చిన్న యూనిట్ ని స్టార్ట్ చేశారు. టీ కప్పులని తినే విధంగా ఈమె తయారు చేయడం మొదలుపెట్టారు ఈమె పేరు జయలక్ష్మి. మామూలుగా ఏదైనా కప్పుని ఉపయోగించాలంటే కెమికల్స్ ఉంటాయేమో అని మనం భయపడుతూ ఉంటాము అందుకని ఈమె కొత్తగా ఆలోచించింది.

ఆరోగ్యకరమైన పదార్థాలతోనే కప్పులను తయారు చేయడం స్టార్ట్ చేసింది జయలక్ష్మి. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఆరోగ్యకరమైన జాగ్రత్తలు కూడా తీసుకున్నారు కప్పులు ని బియ్యం పిండి రాగులు వంటి వాటితో తయారు చేస్తున్నారు. ఈ కప్పులను తయారు చేయాలని ఈమె నిర్ణయించుకున్న తర్వాత రెండు నెలల పాటు ఈమె ఈ యూనిట్ కి సంబంధించిన సమాచారాన్ని సేకరించారు.

కాస్త భిన్నంగా ఉండాలని ఈ ఆలోచనని అనుసరించారు ఇప్పుడు ఆర్డర్లు వస్తున్నాయి నెలకి దాదాపు 3 వేల నుండి నాలుగు వేల కప్పులని ఈమె తయారు చేస్తున్నారు. ఏడాదికి 7 నుండి 10 లక్షల రూపాయల ఆదాయం వస్తోంది. భర్తకి అనారోగ్యం రావడం తర్వాత కరోనా బారిన పడడం ఇలా కష్టాలు ఎదుర్కోవడంతో ఈమె ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలని అనుకున్నారు అయితే వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేకపోయినా సరే ఈమె ఈ రోజు మంచి సక్సెస్ ని అందుకున్నారు.

మనం రోజూ తాగే టీ కాఫీ కోసం ఈ కప్పులని ఉపయోగించవచ్చు ఈమె కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్కీం ద్వారా లోన్ కూడా తీసుకున్నారు. ఈ టీ కప్పులు 20 నిమిషాల వరకు వేడిపానీయాన్ని కలిగి ఉండగలవు. ఈ టీ కప్స్ లో చాక్లెట్, స్ట్రాబెరీ, వనీలా, ఇలాచీ వంటి రుచులు కూడా ఉన్నాయి కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా రాజస్థాన్ మహారాష్ట్ర తమిళనాడు చత్తీస్గఢ్ ఇలా దేశంలో పలు రాష్ట్రాలకి సప్లై చేస్తున్నారు ఇప్పుడు నెలకి 80,000 కి పైగానే వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news