ఏపీలో కూల్చివేతపై చంద్రబాబు ఆగ్రహం..ఇది తుగ్లక్ చర్యే!

-

గీతం వర్సిటీలో కూల్చివేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇది మూమ్మాటికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అని తుగ్లక్ చర్యగా అభివర్ణించారు చంద్రబాబు..గీతం యూనివర్సిటీ ఎంతోమంది విద్యార్ధుల చదువులకు, యువత ఉపాధికి దోహదపడుతుందని..రోగుల వైద్యానికి దోహదపడుతోన్న విశాఖలోని అత్యున్నత ‘గీతం’ విద్యాసంస్థల కూల్చివేతలను ఖండిస్తున్నట్లు ట్విట్టర్‌లో ప్రకటించారు.. కోర్టులో ఉన్న వివాదంపై, ఎటువంటి ఆదేశాలు రాకముందే యూనివర్సిటీ కట్టడాలను కూల్చేయడం వైసిపి కక్ష సాధింపు చర్య అని.. ప్రతిష్టాత్మక విద్యాసంస్థపై ఇలా విధ్వంసాలకు పాల్పడటం రాష్ట్ర ప్రగతికి మంచిదికాదన్నారు..
మొన్న మాజీ మేయర్ సబ్బం హరి ఇంటిపై విధ్వంసం, నేడు గీతం వర్సిటిలో విధ్వంసం వైసిపి కక్ష సాధింపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం.వ్యక్తులపై,పార్టీపై అక్కసుతో రాజకీయ కక్ష సాధింపు చర్యలను గర్హిస్తున్నాం..గవర్నమెంట్ టెర్రరిజం అంటూ ఇప్పటికే విద్యా, వైద్య ,పారిశ్రామిక సంస్థలు ఆంధ్రప్రదేశ్ కు రావాలంటేనే భయపడే దుస్థితి ఏర్పడింది..ఇక్కడి హింసా విధ్వంసాలను చూసి బీహార్ ఆప్ సౌత్ ఇండియా అనుకుంటూ అనేక కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు..

కరోనా కాలంలో సామాజిక బాధ్యతగా కోట్ల రూపాయల నష్టాన్ని భరించి 2,590 మంది కోవిడ్ పేషంట్లకు చికిత్స అందించింది గీతం సంస్థ. అలాంటి ఆదర్శవంతమైన సరస్వతీ నిలయాన్ని అర్థరాత్రి 200 మందితో వెళ్ళి కూల్చడం దారుణమని..కట్టడం చేతగానివాళ్లకు కూల్చే హక్కులేదన్నారు…ఇప్పటికే చదువు,ఉపాధి,ఆరోగ్య చికిత్సల కోసం ఏపీ ప్రజలు పక్కరాష్ట్రాలకు పోతున్నారు.ఈ సమయంలో అటు విద్యాసేవ,ఇటు సామాజికసేవల్లో చేయూత అందిస్తూ రాష్ట్రానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు గర్వకారణమైన గీతం సంస్థలపై రాజకీయ కక్షసాధింపు మరో తుగ్లక్ చర్య అన్నారు చంద్రబాబు..

Read more RELATED
Recommended to you

Latest news