చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా

-

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. తొలుత సీఐడీ తరఫు న్యాయవాది ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించగా, ఆ తర్వాత చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.

Courts adjourn Naidu's cases to October 4

రెండు రోజుల క్రితం సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా ఢిల్లీ నుంచి వాదనలు వినిపించారు. అనంతరం సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. చంద్రబాబు అక్రమాలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఆ తర్వాత సిద్ధార్థ లూథ్రా కౌంటర్ వాదనలు వినిపించారు. రాజకీయ దురుద్దేశంతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారన్నారు. ఆ తర్వాత తదుపరి వాదనలు కొనసాగించే క్రమంలో భాగంగా విచారణను వచ్చే నెల 3కు వాయిదా వేశారు. ఇదిలా ఉంటే.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఇప్పటికే చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news