ఆంధ్రప్రదేశ్ లో బిజెపి జనసేన పొత్తు పెట్టుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా రాష్ట్రంలో భవిష్యత్తు లేదు అనుకున్న రెండు పార్టీలు కూడా పొత్తుపెట్టుకుని ముందుకి వెళ్ళాలి అని చూడటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు ఆ రెండు పార్టీలకు రాష్ట్రంలో ఏ మేరకు భవిష్యత్తు ఉంటుంది అనేది చెప్పలేని పరిస్థితి. అయితే రాష్ట్రంలో పవన్ కి ఫాలోయింగ్ ఉండటం, కేంద్రంలో బిజెపికి బలం ఉండటం,
రాజకీయంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు బిజెపి వైపు చూడటంతో బిజెపికి, జనసేనకు కలిసి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో బిజెపిలోకి వెళ్లేందుకు పలువురు నేతలు సిద్దంగా ఉన్నారని అంటున్నారు.
ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలు, కొందరు మాజీ మంత్రులు బిజెపి తీర్ధం పుచ్చుకున్నారు. ఇక ఇప్పుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారేందుకు గాను సిద్దమయ్యారు. ఆయనకు పవన్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన కూడా బిజెపి తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆయన జెపి నడ్డా సమక్షంలో బిజెపి తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే రంగం సిద్దం చేసుకున్నారట గంటా.