పోలవరం ప్రాజెక్టును కట్ట లేకపోతే వైఎస్ఆర్సిపి ఎంపీలు రాజీనామా చేయాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన జగన్.. ఇప్పుడు మాత్రం అడుగుతూనే ఉంటా అంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సిపి ఎంపీలు రాజీనామా చేయాలని.. సీఎం జగన్ పరదాల చాటున తిరగడం మాని ప్రజల్లో తిరగడం నేర్చుకోవాలని చంద్రబాబు సూచించారు.
తమ హయాంలోనే పోలవరం పనులు 72 శాతం పూర్తయ్యాయన్న చంద్రబాబు జగన్ పోలవరం ప్రాజెక్టు నాశనం చేసి.. ప్రజలను వరద ముంపునకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. అయితే చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ మాజీమంత్రి కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబు ఉచిత సలహాలు మాకు అక్కర్లేదని అన్నారు కొడాలి నాని. అవసరమైతే టిడిపి ఎంపీల చేత రాజీనామా చేయించాలని సూచించారు. ఎంపీలతో కాదు చంద్రబాబు సర్పంచులతో కూడా రాజీనామా చేయించలేడని ఎద్దేవా చేశారు కొడాలి నాని.