చిత్తూరు పర్యటనకు చంద్రబాబు.. అరెస్ట్ చేస్తారా ?

-

ఈ రోజు చంద్రబాబు చిత్తూరు పర్యటనకు వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 9 గంటల 45 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పుత్తూరు మీదుగా చిత్తూరు వెళ్లనున్నారు. తిరుపతి, చిత్తూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఉన్న తెలుగు దేశానికి చెందిన కొంత మంది అభ్యర్థులు మీద దాడులు జరిగాయి. దీనికి కారణం అధికార పక్షం వారు అని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ అభ్యర్థులకు అండగా ఉన్నామని చెప్పేందుకు గాను చంద్రబాబు పర్యటనకు వెళుతున్నారు. అయితే ఈ పర్యటన నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.

చిత్తూరులో చంద్రబాబు దీక్ష చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు దీక్షకు అనుమతి లేదని ప్రకటించారు. అలాగే తిరుపతిలో ధర్నా చేయాలని పర్మిషన్ అడిగినా దానికి కూడా వాళ్లు అనుమతి లేదని చెబుతున్నారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆ నిబంధనల ప్రకారం చంద్రబాబుకు పర్మిషన్ ఇవ్వడం లేదని పోలీసులు చెబుతున్నారు. చిత్తూరు పర్యటనకు కూడా వాళ్ళు అనుమతి ఇవ్వకుండా ప్రస్తుతం జిల్లా అంతటా 144 సెక్షన్ విధించారు అని చెబుతున్నారు. ఒకవేళ చంద్రబాబు వీటిని దిక్కరించి వస్తే ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news