వరి వేయద్దు అంటున్నారు…గంజాయి వేయాలా..? : చంద్రబాబు

పాప నాయుడు పేట వద్ద చంద్రబాబు ప్రసంగించారు. ఈ సంధర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ….ఇది ప్రజాస్వామ్యం కాదు. ఉన్మాద స్వామ్యం అంటూ మండి పడ్డారు. మడమ తిప్పను అని గిరగిరా తిప్పుతూనే ఉన్నాడు… తుగ్లక్ నయం ఈ జగన్ తుగ్లక్ కంటే అంటూ ఫైర్ అయ్యారు. ఇది ప్రకృతి విలయం కాదని… జగన్ పట్టించుకోక పోవడం, ప్రభుత్వానికి ముందు చూపు లేక పోవడం వల్ల వచ్చిన దుస్థితి అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు.chandrababu naidu

నేను సీఎం గా ఉన్నపుడు సంక్షోభంలో ఎలా స్పందించాను, ఇప్పుడు ఎలా స్పందిస్తున్నారో ప్రజలు ఆలోచించాలి అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలు మంచి చెడు విశ్లేషించు కోవాలని. …ధర్మాన్ని కాపాడాలి అని చంద్రబాబు అన్నారు. జగన్ మానసిక స్థితి బాగాలేదని….మాములు వ్యక్తి అలా ఉన్నా పర్లేదు. ముఖ్యమంత్రి హోదా లో ఉన్న వ్యక్తి అలా ఉంటే అందరికి ప్రమాదమేనని అన్నారు. వరి వేయద్దు అంటున్నారు, గంజాయి ఎయ్యాలా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ప్రపంచంలోనే ఏపీకి చెడ్డపేరు తెప్పిచ్చారని చంద్రబాబు మండి పడ్డారు.