తెలంగాణలో అమలయ్యేది భారత రాజ్యాంగమా…? కల్వకుంట్ల రాజ్యాంగమా…? టీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి ఫైర్

-

టీఆర్ఎస్ పార్టీపై టీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి ఫైరయ్యారు. నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు వేస్తున్న సందర్భంలో రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలి నామినేషన్‌ పత్రాలను తెరాస శ్రేణులు చించివేయడంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. నిన్న జరిగిన ఘటనలపై ట్విటర్​​ వేదికగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరం నడిబొడ్డున ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్నారు. పోలీసుల సమక్షంలో ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలి నామినేషన్‌ పత్రాలు చించివేత జరుగుతున్నా పోలీసులు అడ్డుకోలేక పోయారని ఆరోపించారు. పోలీసులు రక్షక భటులా..? లేక కేసీఆర్ బానిసలా..? అని ప్రశ్నించారు. తెలంగాణ లో భారత రాజ్యాంగం అమలవుతుందా… కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతుందా..అని ట్విట్టర్ లో ప్రశ్నించారు.

అయితే నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు చివరి రోజు కావడంతో రంగారెడ్డి కలెక్టరేట్ ముందు ఉద్రిక్తత తలెత్తింది. శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డిలు నామినేషన్లు వేయడానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇదే సమయంలో నామినేషన్ వేయడానికి వచ్చిన స్వతంత్ర అభ్యర్థులను అడ్డుకుని.. వారి నామినేషన్లను చించివేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. నిన్న జరిగిన ఘటనపై రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news