కౌరవ సభను, గౌరవ సభగా చేసి అసెంబ్లీలో అడుగు పెడతానని సంచలన ప్రకటన చేశాడు టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లాలో 3 రోజులు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో రెండో రోజు గురువారం కర్నూలు జిల్లా ఆదోని లో రోడ్షో నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ గౌరవ సభ కాదు….కౌరవ సభ అని…క్షేత్రం స్థాయి లో గెలిచి మరి గౌరవ సభగా చేసి సీఎం అసెంబ్లీ లో అడుగు పెడతాన న్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే కనబడటం లేదు….పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టండని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే కుటుంబం దుకాణాలు పెట్టిందని.. ఎమ్మిగనూరులో టెక్స్ టైల్ పార్క్ కు 93 ఎకరాలు మంజూరు చేశా….దాన్ని కొట్టేయాలని చూస్తున్నారని వెల్లడించారు. ఎస్ ఎస్ ట్యాంక్ కు భూమి కేటాయిస్తే దాన్ని కొట్టేయాలని చూస్తున్నారని… స్థానిక సంస్థలకు సీఎం జగన్ నిర్వీర్యం చేశారని నిప్పులు చెరిగారు చంద్రబాబు.