ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు రెండు రోజుల సీఐడీ కస్టడీ ఆదివారంనాడు సాయంత్రంతో ముగిసింది.ఈ నెల 22వ తేదీన ఏపీ సీఐడీ కస్టడీకి రెండు రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది ఏసీబీ కోర్టు. దీంతో ఈ నెల 23, 24 తేదీల్లో సీఐడీ అధికారులు ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును విచారించారు. ఈ నెల 23న ఏడు గంటల పాటు చంద్రబాబును విచారించారు. ఇవాళ ఉదయం నుండి సాయంత్రం వరకు బాబు విచారించారు. శనివారం నాడు ఏడు గంటల పాటు 50 ప్రశ్నలు అడిగారు. ఇవాళ మరో 70 ప్రశ్నలు అడిగినట్టుగా సమాచారం. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీఐడీ అధికారులు తాము సేకరించిన డాక్యుమెంట్ల ఆధారంగా చంద్రబాబును రెండు రోజుల పాటు సమాచారం సేకరించారు.
కాగా, చంద్రబాబు రిమాండ్, కస్టడీ ఈ రోజుతో ముగిశాయి. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మరింత విచారణ కోసం మరికొన్ని రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ… న్యాయమూర్తిని కోరనున్నారని తెలుస్తోంది. చంద్రబాబు రిమాండ్ కూడా నేటితో ముగియనున్నందున న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది. చంద్రబాబును సీఐడీ అధికారులు వర్చువల్‌గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తారు.