నీచం.. నికృష్టం.. చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

-

గొల్లపూడి: మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్‌ తీరుపై చంద్రబాబు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్‌పై పరిశీలనకు వెళ్తే అక్రమ కేసులు పెడతారా అని ప్రశ్నించారు. దేవినేని ఉమ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘కారులోనే దేవినేని ఉన్నారు. కేసులు ఎలా పెడతారు?. అన్యాయం అని చెబితే రివర్స్ కేసులు పెడతారా?. తెలుగు దేశం పార్టీ భయపడదు. కోవిడ్ నెపంతో అరాచకాలకు పాల్పడుతున్నారు. కేసులు పెట్టేందుకు పోలీస్ స్టేషన్ కు వెళితే రివర్స్ కేసులు పెడతారా?. ఉన్మాదులు ఎదురుదాడికి పాల్పడుతున్నారు. సున్నితంగా ఉండాల్సిన ప్రభుత్వం.. రౌడీ ఇజం చేస్తోంది. రాబోయే రోజుల్లో ప్రతిఒక్కరూ తిరగబడతారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఏమీ చేయలేదు. రెండేళ్లుగా వాళ్లపై దాడులు జరుగుతున్నాయి. దళితుల హక్కులను వైసీపీ నేతలు కాలరాస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఎస్టీ, ఎస్సీలకు ద్రోహం చేస్తున్నారు. రాష్ట్రం నాశనం అయిపోయింది. దౌర్జన్యంతో బతకాలని చూస్తున్నారు.’’ అని అన్నారు.

చంద్రబాబు ఇంకా మాట్లాడుతూ ‘‘ రాష్ట్రంలో అభివృద్ధి లేదు. పోలీసులు అధికార పార్టీకి లొంగిపోయారు. ఎప్పటికైనా బలి పశువులు అవుతారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్షార్హులవుతారు. ఇప్పటికే మొత్తం పోలీస్ వ్యవస్థపై నమ్మకం పోయే పరిస్థితి తెచ్చుకున్నారు. స్వార్థం మంచిది కాదు. రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌ను ఎందుకు మార్చారు. కొత్త కొత్త వింత పోకడలు పుట్టుకోస్తున్నాయి.నీచం, నికృష్టం. అక్రమమైనింగ్‌ దోపిడీదారులపై యాక్షన్ తీసుకోండి… పట్టించుకోకపోతే కోర్టులకు వెళతాం. ప్రజాధనాన్ని కాపాడతాం.’’అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news