టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిని అక్రమంగా అరెస్టు చేశారని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. జలవనరుల శాఖ ఈఈని బెదిరించి అయ్యన్నపై తప్పుడు ఫిర్యాదు ఇప్పించారని ఆరోపించారు. విశాఖలో విశాఖలో భూ కబ్జాలపై పోరాడితే అరెస్టు చేస్తారా? అని నిలదీశారు. వివేకా హత్యపై షర్మిల వాంగ్మూలం, రుషికొండ అంశం నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించడానికే అయ్యన్నను అరెస్టు చేయించారని అన్నారు.
“సీఐడీ ఆఫీస్ టార్చర్ ఆఫీస్‌గా మారింది. శారీరకంగా హింసిస్తారేమో.. మానసికంగా మేం బలంగా ఉన్నాం. నలుగురు మాజీ మంత్రులను అక్రమంగా అరెస్టు చేయిస్తారా? అయ్యన్నపై రేప్ కేసు పెడతారా? కోర్టులు చీవాట్లు పెట్టినా ఈ ప్రభుత్వానికి బుద్ధిరాలేదు. జగన్ లాగా ఎవరి అకౌంట్లకు డబ్బు రాలేదు. 24 మంది బీసీ నేతలను చంపేస్తారా? బీసీల్లో నాయకత్వం రావడం చాలా కష్టం. అయ్యన్న కుటుంబంపై 12 కేసులు పెట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వమే చేస్తున్న టెర్రరిజం ఇది. తెదేపా నేతలపై కేసులు పెడుతున్న సీఐడీ అధికారుల చరిత్ర ఏంటి? ఎవరికి చెబుతారు కాకమ్మ కబుర్లు? ” అంటూ ఏపీ ప్రభుత్వంపై, సీం జగన్ పై చంద్రబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు.