స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబుకి షాక్ మీద షాక్ మీద షాక్ లు ఇస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలు చంద్రబాబు ఎప్పుడూ మర్చిపోలేని ఊహించని విధంగా 23 స్థానాలు ఇచ్చి అదిరిపోయే బంపర్ షాక్ ఇవ్వగా…ఇప్పుడు టిడిపి నాయకుల వంతు అయింది. స్థానిక ఎన్నికలు జరగకముందే తెలుగుదేశం పార్టీ నాయకులే ఒక్కొక్కరు పార్టీని విడిపోడం చంద్రబాబు మైండ్ గేమ్ కి గిర్రు గిర్రున దెబ్బలు తగులుతూనట్లు తెలుస్తోంది.కొన్ని దశాబ్దాలుగా రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు రామసుబ్బారెడ్డి మరియు కొంతమంది నాయకులు ఇటీవల జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోవడం జరిగింది. అయితే తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ తెలుగుదేశం పార్టీ మహిళలు కూడా వైసీపీ పార్టీలోకి రావడానికి అంతా రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీడీపీ సీనియర్ మహిళా నేత, ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కూతురు, మాజీ ఎమ్మెల్యే యామినిబాల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు అమరావతికి జై కొట్టడంతో రాయలసీమకు చెందిన ఎమ్మెల్సీ శమంతకమణి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లు పెట్టినప్పుడు కొద్దిగా జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు. అయితే తాజాగా మాత్రం రాష్ట్రంలో అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు మరియు అభివృద్ధి జరుగుతున్న తరుణంలో జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలోకి రావటానికి రెడీ అయ్యారు. దీంతో వరుసపెట్టి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు వెళ్ళి పోతుండటంతో…చంద్రబాబుకి మైండ్ గిర్రున తిరుగుతుంది అని ఏపీ రాజకీయాల్లో టాక్.