తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీని నడిపించటానికి నానా తంటాలు పడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో కోలుకోలేని విధంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో…అతి తక్కువ స్థానాల తో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు చంద్రబాబు. దీంతో సొంత పార్టీలో ఉన్న నాయకులు చంద్రబాబు ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనబడటం లేదు. కొంతమంది నాయకులు అయితే ఏకంగా చంద్రబాబుని బండబూతులు తిడుతూ టిడిపి లోనే కొనసాగుతూ…అసెంబ్లీలో వైసీపీ కి మద్దతు తెలుపుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో తెలుగుదేశం పార్టీలో అంతర్గత యుద్ధం నాయకుల మధ్య జరుగుతున్నట్లు దీంతో చంద్రబాబు తల పట్టుకుంటున్నటు వార్తలు వస్తున్నాయ.స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీలో ఆర్థికంగా బలంగా ఉండే నాయకులు పార్టీకి సపోర్ట్ చేయడానికి ఆర్థికంగా డబ్బులు ఇవ్వటం లేదని..ఇదే తరుణంలో ప్రభుత్వం బిల్లులు ఆపడంతో ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు ఖర్చు భరించలేమని చేతులెత్తేసినటు పార్టీలో టాక్. ముఖ్యంగా స్థానిక ఎన్నికలలో నామినేషన్ వేసిన నాయకులకు మరియు ఫైనాన్షియల్ గా పార్టీకి సపోర్ట్ ఉండే వాళ్ల మధ్య తీవ్ర బేధాభిప్రాయాలు కలుగుతున్నాయి.
డబ్బులు తీసినా గెలుపు ఖాయం కాదని ఒకవేళ గెలిచినా.. గెలుపొందిన వాళ్లు పార్టీలో ఉంటారో లేదో నమ్మకం కూడా లేదని ఫైనాన్షియల్ గా పార్టీకి వెన్నుదన్నుగా ఉండేవాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. దీంతో స్థానిక ఎన్నికలలో టిడిపి తరఫున పోటీ చేయాలి అని అనుకునే వాళ్ళు ఈ కామెంట్ ను తప్పు పడుతున్నారు. దీంతో ఈ రెండు గ్రూపుల మధ్య పొలిటికల్ వార్ టిడిపిలో గట్టిగా ఉండటంతో టిడిపి అధినేత చంద్రబాబు తలపట్టుకుంటున్నారు అని పార్టీలో టాక్.