హైడ్రా వెనుక ఉన్నదే ఏపీ సీఎం చంద్రబాబు అని కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడి రేవంత్ రెడ్డి ఇక్కడి నుండి పెట్టుబడులను అమరావతికి తీసుకుపోతున్నాడు. ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని హైదరాబాద్ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టాలి అంటే భయపడే పరిస్థితికి తీసుకు వచ్చారు. ఇది అంత ఒక పెద్ద కుట్ర.. రేవంత్ రెడ్డి హైదరాబాద్ డెవలప్ కాకుండా చేస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు కౌశిక్ రెడ్డి.
ఆంధ్రా సెటిలర్స్ అంటే నాకు ఎంతో గౌరవం.. ఆంధ్రావాళ్లను నేను అనలేదు. కావాలనే ఆంధ్రా అంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు కౌశిక్ రెడ్డి. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోంది. 40 మంది గూండాలను సైబరాబాద్ పోలీసులు ఆపలేకపోయారా..? నేను చేసిన తప్పేంటి..? కౌశిక్ రెడ్డి చావడానికి అయినా సిద్దంగా ఉన్నాడు.. రేవంత్ రెడ్డితో మాత్రం కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేడు అని పేర్కొన్నారు.