ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పై ఎన్నికల అధికారికి చంద్రబాబు లేఖ రాశారు. అలాగే, టీడీపీ పోటీ చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో, నిబంధనల అమలు, అక్రమాల నివారణపై జిల్లా అధికారులకు, ఎన్నికల అధికారులకు చంద్రబాబు ఫోన్ చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి M.K. మీనా, అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ, ఎస్పీ ఫకీరప్ప లతో ఫోన్ లో మాట్లాడారు టీడీపీ అధినేత చంద్రబాబు.
అనంతపురం కౌంటింగ్ సెంటర్ లోకి ఎటువంటి పాసులు లేకుండా చొరబడి…టీడీపీ వారిపై దాడులకు దిగిన వైసీపీ శ్రేణులపై తక్షణ చర్యలకు చంద్రబాబు సిద్ధం అయ్యారు. పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ చివరి దశలో పెద్ద ఎత్తున అక్రమాలకు వైసీపీ సిద్దమైందని ప్రధాన ఎన్నికల అధికారి మీనాకు చంద్రబాబు ఫిర్యాదు చేశారు.కౌంటింగ్ ప్రక్రియలో లోపాలు లేకుండా, కౌంటింగ్ సెంటర్ల వద్ద నిబంధనలు పూర్తిగా అమలయ్యేలా చూడాలని అధికారులను కోరిన చంద్రబాబు.. ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలు, ఎన్నిక బాధ్యులకు ఆదేశించారు.