సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరిగి ఆరుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ ఘటనపై కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.
మరోవైపు ఈ ఘటనపై అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి స్పందించారు. అగ్నిప్రమాదానికి ప్రధాన కారణం షార్ట్ సర్య్కూట్‌గానే భావిస్తున్నామని తెలిపారు. ‘‘స్వప్న లోక్ బిల్డింగ్ యజమానులకు ఫైర్ సేఫ్టీ పెట్టుకోమని చెప్పాం. కానీ వారు నిర్లక్ష్యం చేశారు. భవనంలో ఫైర్ సేఫ్టీ పెట్టారు కానీ, అవి ఏమాత్రం పని చేయడం లేదు. ఈ ఘటనలో షాపు కీపర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ప్రతి కమర్షియల్ కాంప్లెక్స్‌లో తప్పనిసరిగా ఉండాలి. ఫైర్ సేఫ్టీ పెట్టుకుంటే సరిపోదు వాటి నిర్వహణ సరిగా ఉంచుకోవాలి. ప్రధానంగా కమర్షియల్ కాంప్లెక్స్‌లు లాక్ చేయకూడదు. వ్యాపార లావాదేవీలు నిర్వహించే వారు మెయింటనెన్స్ విషయంలో నిర్లక్ష్యం వహించకూడదు. ఈ విషయంపై గతంలో స్వప్నలోక్ కాంప్లెక్స్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చాం.” అని నాగిరెడ్డి అన్నారు.