బాబు ముందుచూపు…ఓడిపోయే సీట్లు ఫిక్స్?

-

ఏంటో ఈ మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాలు పూర్తిగా కొత్తగా ఉంటున్నాయి…గతంలో మాదిరిగా స్లోగా కాకుండా…ఇప్పుడు చాలా ఫాస్ట్‌గా రాజకీయం చేస్తున్నారు..నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా బాబు ముందుకెళుతున్నారు…ఈ సారి ఎలాగైనా వైసీపీని అధికారంలోకి నుంచి దించేసి..తాము సత్తా చాటాలని చూస్తున్నారు. ఎందుకంటే ఈ సారి మాత్రం అధికారంలోకి రాకపోతే ఏం జరుగుతుందో బాబుకు బాగా తెలుసు…ఇంకోసారి గాని జగన్ అధికారంలోకి వస్తే టీడీపీ అడ్రెస్ గల్లంతయ్యే పరిస్తితి ఉంది.

chandrababu naidu

అందుకే చంద్రబాబు ఎలాగైనా అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా రాజకీయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఊహించని విధంగా ఎన్నికలకు ఇంకా రెండేళ్ళు పైనే సమయం ఉంది…కానీ ఇప్పుడే చంద్రబాబు అసెంబ్లీ సీట్లు ఫిక్స్ చేసేస్తున్నారు. సాధారణంగా బాబు ఎప్పుడు ఎన్నికలకు ముందే అభ్యర్ధులని ఫిక్స్ చేసేవారు…కానీ ఇప్పుడు పూర్తిగా వేరు…ఇప్పుడే అభ్యర్ధులని సెట్ చేసేస్తున్నారు.

ఇప్పటికే చాలా సీట్లలో అభ్యర్ధులని ఫిక్స్ చేసేశారు….తాజాగా కూడా బాబు కొన్ని సీట్లు ఫిక్స్ చేశారు. అయితే తాజాగా ఫిక్స్ చేసిన సీట్లలో ఓడిపోయే సీట్లు ఎక్కువ ఉన్నాయని చర్చ నడుస్తోంది. తాజాగా పులివెందులలో జగన్ ప్రత్యర్ధిగా బీటెక్ రవిని పెట్టారు. అంటే పులివెందుల టీడీపీ అభ్యర్ధిగా బీటెక్ రవిని నియమించారు. ఇక పులివెందులలో జగన్‌పై బీటెక్ రవి గెలవడం అనేది గగనం. అదే సమయంలో శ్రీకాళహస్తి సీటులో బొజ్జల సుధీర్ రెడ్డిని ఫిక్స్ చేశారు…అక్కడ కూడా వైసీపీ స్ట్రాంగ్‌గా ఉంది..కాళహస్తిలో కూడా టీడీపీకి గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి.

ఇక ప్రొద్దుటూరు సీటులో ప్రవీణ్ కుమార్ రెడ్డిని పెట్టారు. ఈ సీటు వైసీపీ కంచుకోట అనే సంగతి తెలిసిందే…ఇక్కడ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఈ సీటులో కూడా టీడీపీ గెలుపు అనేది కష్టమే. ఇలా చంద్రబాబు ఓడిపోయే సీట్లలో అభ్యర్ధులని ఫిక్స్ చేశారని చెప్పొచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news