పత్తి పంటను గులాబీ పురుగు ఆశించకుండా ఉండాలంటే… ఈ ముందస్తు జాగ్రత్తలు పాటించాలి.

-

తెలంగాణలో వాణిజ్య పంటల్లో పత్తిదే అగ్రస్థానం. ఏ నేలలో అయినా పత్తిని పండే అవకాశం ఉండటంతో పాటు మద్దతు ధర ఉండటం కూడా పత్తిని సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణలో దాదాపు 40 లక్షల ఎకరాల కన్నా ఎక్కవ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.

దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా ఒకే నేలతో పత్తిని సాగు చేస్తుండటంతో… అనేక పురుగులు ఆశిస్తున్నాయి. కాయతొలిచే పురుగు, రసం పీల్చే పరుగులు ఇలా పత్తి పంటపై దాడి చేస్తున్నాయి. అన్నింటి కన్నా ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా పత్తి పంటను గులాబీ పురుగు ఆశిస్తోంది. గులాబీ పురుగు ఆశించడంతో పత్తి పంట దిగుబడి గణీనయంగా తగ్గుతోంది. 

ప్రస్తుతం పత్తి పంట దాదాపుగా పూర్తియింది. ఈ ఏడాది మద్దతు ధర కన్నా ఎక్కువగా ధర ఉంది. రికార్డ్ స్థాయిలో క్వింటాల్ పత్తికి గరిష్టంగా రూ.10,000 పలికిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

గులాబీ పురుగు కారణాలు:

గులాబీ పురుగు తీవ్రతకు ముఖ్య కారణం పత్తి పంట కాలాన్ని పెంచడం. సాధారణంగా పత్తి పంట కాలం ఆరు నెలలు ఉంటుంది. కానీ చాలా మంది రైతులు ఈ పంట కాలాన్ని మరింతగా పెంచుతున్నారు. నీటిని అందిస్తూ… మూడు నాలుగు సార్లు పత్తిని తీస్తున్నారు. దీంతో పత్తిలో గులాబీ పురుగు తీవ్రత పెరుగుతోంది. 

దీంతో పాటు పత్తి తీసిన తర్వాత కూడా పత్తి చెట్లను చేలల్లోనే నెలల తరబడి అలాగే ఉంచుతున్నారు. దీని వల్ల పురుగు అవశేషాలు నేలలోనే ఉంటున్నాయి. దీని వల్ల కూడా గులాబీ పురుగు తీవ్రత పెరిగింది. పత్తితో గులాబీ రంగు పురుగును సమగ్ర చర్యల ద్వారానే గులాబీ రంగు పురుగును అరికట్టవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

ఎండాకాలం మొత్తం పత్తి చెట్లను అలాగే ఉంచుతున్నారు. రాబోయే ఖరీఫ్ లో ఈ పత్తి మోళ్ల నుంచి గులాబీ రంగు పురుగు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ కాలం పంట ఉంటే.. గులాబీ రంగు పురుగు జీవిత చక్రం పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో పంట కాలాన్ని పెంచకుంటే.. గులాబీ రంగు కాయతొలిచే పురుగును నివారించే అవకాశం ఉంటుంది. 

నివారణ చర్యలు:

పత్తి పంటను ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్, జనవరి నెలలకు పొడగించవద్దు. ప్రతీ రెెండు మూడు సంవత్సరాలకు పంట మార్పిడి చేసుకోవాలి. జొన్న, మొక్కజొన్న పంటలను సాగు చేయాలి. తక్కువ కాల పరిమితి ఉన్న విత్తనాలనే వాడాలి. పత్తి చేలల్లో తుత్తురు బెండ, వయ్యారిభామ వంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి.

సంక్రాంతి లోపు పత్తి కర్రను చేల నుంచి తీసి వేయాలి. గులాబీా రంగు పురుగు కోశస్థ దశలు పత్తి మొక్క మోళ్లలో, భూమిలో ఉంటాయి. మళ్లీ జూన్ లో పత్తి పంట వేస్తే గులాబీ రంగు పురుగు ఆశించే అవకాశం ఉంటుంది. ట్రాక్టర్లు రోటవేటర్ తో పత్తి కర్రను పొట్టుపొట్టు చేయాలి. ఇలా చేయడం వల్ల సేంద్రీయ కర్భన ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది.

ఎండాకాలంలో లోతు దక్కులను దున్నాలి. గులాబీ రంగు పురుగు లార్వా కోశస్థ దశల్లో ఉండీ భూమి నెర్రల్లో ఉంటుంది. లోతు దుక్కులు చేసుకుంటే… బయటకు వచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news