సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా పరిషత్ ఎన్నికలు నిర్వహించారంటూ ఇటీవల హైకోర్టు ఎన్నికలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు తీర్పు వచ్చినప్పటి నుంచి ఎన్నికల సంఘం కమిషనర్ నీలం సాహ్నిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ రోజు చంద్రబాబు నాయుడు కూడా ఆమెపై ఘాటు విమర్శలు చేశారు.
నీలం సాహ్ని ఐఏఎస్ ఆఫీసర్ అని, అలాంటి ఆమెకు కనీసం సుప్రీంకోర్టు ఇచ్చిన నివేదికను ఇంగ్లీష్‌లో చదవడం కూడా రాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా జగన్ కోసం ధిక్కరించారని విమర్శించారు.
అలాంటి ఆమెకు ఒక్క క్షణం కూడా ఆ సీటులో కూర్చునే అర్హత లేదంటూ మండిపడ్డారు. ఎన్నికల కోసం రూ.160కోట్ల ప్రజాధనం వృథా చేశారని, ఇప్పుడు అవి ఎవరు కడతారని, ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్య బద్ధంగా పనులు చేయాలంటూ సూచించారు. మొత్తానికి చంద్రబాబు నాయుడికి మంచి పాయింట్లు దొరికాయి విమర్శించడానికి కదా.