ఉద్యోగార్థులకు సౌత్ సెంట్రల్ రైల్వే తీపి కబురు అందించింది. ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా, కేవలం మౌఖిక పరీక్ష ఆధారంగా నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది ఒకవిధంగా నిరుద్యోగులకు సౌత్ సెంట్రల్ రైల్వే అందించిన గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో ఇటీవల భారీ స్థాయిలో మెడికల్ స్టాఫ్ సిబ్బంది నియామాలను చేపడుతున్నారు. తాజాగా సికింద్రాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వేలో పలు ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 4, 5 తేదీల్లో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో ప్రకటించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 80 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో ల్యాబ్ అసిస్టెంట్, హెల్త్ అండ్ మలేరియా ఇన్సె్పక్టర్, స్పెషల్ డాక్టర్, జీడీఎంఓ, స్టాఫ్ నర్స్, హాస్పటల్ అటెండెంట్ తదితర పోస్టులు ఉన్నాయి.
ఉద్యోగ అర్హతలు
జీడీఎంఓ: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించి ఇంటర్న్ షిప్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హులు. గరిష్ఠ వయోపరిమితి 53 ఏళ్లు. ఎంపికైన వారికి నెలకు రూ. 75 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
స్పెషలిస్ట్ డాక్టర్: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ చేసి, పీజీ లేదా డిప్లొమో అర్హత కలిగిన వారు అర్హులు. వయోపరిమితి 53 ఏళ్లు. నెలకు రూ. 95 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
నర్సింగ్ సూపరింటెండెంట్: బీఎస్సీ నర్సింగ్ చేసిన వారు ఈ ఉద్యోగానికి అర్హులు. వయస్సు 20–33 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 44,900 వరకు వేతనం చెల్లించనున్నారు.
హాస్పిటల్ అటెండెంట్: టె¯Œ ్త, ఐటీఐ పాసై జాతీయ అప్రెంటీస్ సర్టిఫికేట్ కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18–33 ఏళ్లు ఉండాలి. నెలకు రూ. 18 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
ఫార్మసిస్టు: ఇంటర్, బీఫార్మసీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 20–33 ఏళ్లు ఉండాలి. నెలకు రూ. 29,200 వరకు వేతనం చెల్లించనున్నారు.
ల్యాబ్ అసిస్టెంట్: ఇంటర్ తో పాటు డీఎంఎల్టీ ఉత్తీర్ణత సాధించన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. వయస్సు 18–33 ఏళ్లు ఉండాలి. నెలకు రూ. 21700 వరకు వేతనం చెల్లించనున్నారు.
దరఖాస్తు చేసుకునే విధానం
అభ్యర్థులు తమ దరఖాస్తులను [email protected] కు పంపించాలని నోటిఫికేషన్లో సూచించారు. అప్లై చేయడానికి ఈ నెల 29 సాయంత్రం 5 గంటలలోగా అప్లై చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.