నీ భార్యపై, కూతురుపై తప్పుడు రాతలు రాస్తే ఊరుకుంటావా డీజీపీ…?

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ పై తీవ్ర ఆరోపణలు చేసారు. డీజీపీ చేతగానితనం అడుగు అడుగునా కనపడుతుంది అంటూ మండిపడ్డారు. సోమవారం సాయంత్రం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర విమర్శలు చేసారు. ఒక పక్క ప్రజలు కరోనాతో పోరాడుతుంటే జగన్ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్ట్ కి వెళ్ళారని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా కార్యకర్తను అరెస్ట్ చేయడం పై స్పందించారు.

పోలీసు అధికారులు ఊడిగం చేసుకోవాలి అంటే ఆయన ఇంటికి వెళ్లి ఊడిగం చేసుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. డీజీపీ సిగ్గుతో తల దించుకోవాలని అన్నారు. సోషల్ మీడియాలో ఏమీ రాయకపోయినా టీడీపీ కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారని, ఒక కార్యకర్తను అరెస్ట్ చేసిన విధానాన్ని ఆయన మీడియా కు ప్రదర్శించారు. తమ కార్యకర్తలపై ప్రతాపం చూపించడానికి మీరు ఎవరని ప్రశ్నించారు. తమ ఇంట్లో ఆడ వాళ్ళపై ఇలాగే రాస్తే డీజీపీ ఊరుకుంటారా అని ప్రశ్నించారు. బుద్ధి లేని పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

మీ భార్య కూతురుపై ఇలాగే రాస్తే డీజీపీ ఊరుకుంటారా అని మాపై అసభ్యంగా పోస్ట్ లు పెట్టిన వైసీపీ కార్యకర్త పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పోలీసులు సమాధానం చెప్పే రోజు త్వరలోనే ఉందని, ఎవరిని వదిలిపెట్టేది లేదని తీవ్ర పరిణామాలు ఉంటాయని, జగన్ మిమ్మల్ని కాపాడలేరు అని గుర్తు ఉంచుకోవాలని హితవు పలికారు. తమపై అసభ్యంగా పోస్ట్ పెట్టిన వారిని ఎందుకు వదిలేస్తున్నారు అని చంద్రబాబు నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news