మాజీ మంత్రి పేర్ని.. ఒక నీతుల నేత – చంద్రబాబు

-

మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని పై చంద్రబాబు హాట్‌ కామెంట్స్ చేశారు. బందరులో ఒక నీతుల నాని ఉన్నాడని.. ఇసుక ఎక్కడికి పోతుందో ఈ నీతుల నాని చెప్పగలరా? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి పేర్ని ఒక నీతుల నేత అని.. నీతుల ఎమ్మేల్యే జగన్ ఏది చెపితే అది మాట్లాడుతాడని ఫైర్‌ అయ్యారు. పవన్ కళ్యాణ్ పై మాట్లాడడమే ఈ నీతుల నాని కి పనా? అని ఆగ్రహించారు.

బందరు పోర్టు ఏమయ్యిందో ఈ నీతుల నాని చెప్పాలి? అన్నారు. బందరులో ఏ పని చెయ్యాలి అన్నా కప్పం కట్టాల్సిందేనని.. బైపాస్ రోడ్ లో ఒక వ్యక్తి మాల్ కట్టుకుంటే ఆయనకు అనుమతులు ఇవ్వలేదని విమర్శలు చేశారు. నేను కుప్పంలో ఇల్లు కట్టుకుంటాను అంటే అనుమతులు ఇవ్వలేదు…ఇక్కడ ఎమ్మల్యే నీతుల నాని అన్నం తింటున్నడా….భూములు తింటున్నారా? అని ఆగ్రహించారు. కొల్లు రవీంద్ర పై హత్యా నేరం పెట్టీ జగన్ పైశాచిక ఆనందం పొందారని ఫైర్‌ అయ్యారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news