కొండెక్కిన బంగారం.. దిగొచ్చిన వెండి..!

-

అమెరికా- చైనా ఉద్రిక్తతలు, కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితులు సహా గ్లోబల్ మార్కెట్‌లో బంగారం పరుగులు పెట్టడంతో మన దేశంలోనూ పసిడి కొండెక్కి కూర్చుంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా 10వ రోజు పెరిగాయి. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.290 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.55,600కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్లపై అంతే పెరగడంతో బంగారం 10 గ్రాముల ధర రూ.51,030కి పెరిగింది.

వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర రూ.3050 దిగొచ్చింది. దీంతో ధర రూ.63,000కు క్షీణించింది. ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నేడు మార్కెట్‌లో రూ.300 మేర ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,000 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,800కి చేరింది. ఇక కేజీ వెండి ధర రూ.3050 తగ్గుదలతో రూ.63,000కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news