Breaking : అద్భుతం.. చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్‌-3

-

జాబిల్లిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రయోగించిన చంద్రయాన్‌-3.. తన ప్రయాణంలో కీలక ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇప్పటి వరకు భూమి చుట్టూ కక్ష్యలను పూర్తిచేసుకుని, ‘ట్రాన్స్‌ లూనార్‌ కక్ష్య’లో జాబిల్లివైపు దూసుకెళ్లిన ఈ వ్యౌమనౌక.. ఇకనుంచి చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టనుంది. భూ కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-3 ప్రవేశించింది. ఈ మేరకు ఇస్రో కీలక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు అంతరిక్ష నౌక జూలై 14న ప్రయోగించినప్పటి నుంచి చంద్రునిలో మూడింట రెండు వంతుల దూరాన్ని కవర్ చేసినట్లు ఇస్రో ప్రకటించింది. ఇస్రో ప్రకారం రాత్రి 7 గంటలకు చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. ప్రస్తుతం చంద్రయాన్ సరిగ్గా పనిచేస్తోందని ఇస్రో తెలిపింది. చంద్రయాన్ ఈరోజు లూనార్ ఆర్బిట్ ఇంజెక్షన్ (LOI) ద్వారా తన కక్ష్యను చంద్రుని కక్ష్యలోకి మార్చుకుంది. 23 గంటల తర్వాత కక్ష్యను తగ్గించనున్నారు.

Chandrayaan-3 Is Now Close To The Moon. Here's What Will Happen In The Next  24

ఇస్రో జూలై 14న ప్రయోగించిన చంద్రయాన్‌-3.. చంద్రుడి దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే భూమి చుట్టూ కక్ష్యలను విజయవంతంగా పూర్తిచేసుకోగా.. చంద్రుని దిశగా వెళ్తున్న ఈ వ్యోమనౌక మూడింట రెండు వంతుల ప్రయాణాన్ని పూర్తిచేసుకుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శుక్రవారం తెలిపింది. ఇవాళ చంద్రుని కక్ష్యలోకి అడుగుపెట్టనుందని తెలిపింది. ఈ నెల 23న సాయంత్రం జాబిల్లిపై ల్యాండర్ అడుగుపెట్టనుంది. చంద్రయాన్‌-3 చంద్రునికి అత్యంత దగ్గరగా చేరినప్పుడు ఈ ప్రక్రియను చేపట్టనున్నట్టు ఇస్రో తెలిపింది. ప్రస్తుతం దీని పనితీరు బాగానే ఉందని, చంద్రుని కక్ష్యలను విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఈ నెల 23న దీన్ని చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పింది. చంద్రుడిపై దిగే క్రమంలో విక్రమ్ ల్యాండర్ సొంతంగా నిర్ణయాలను తీసుకోగలదని ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్‌కు, చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్‌కు ఇదే ప్రధానమైన తేడా అని పేర్కొంది. గతంలో చంద్రయాన్-2 మిషన్ ల్యాండింగ్ అయ్యే సమయంలో చంద్రుడి ఉపరితలాన్ని ల్యాండర్ బలంగా ఢీకొనగా.. విక్రమ్ ల్యాండర్‌లోని వ్యవస్థలు పని చేయకుండా పోయాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news