వారికి కేంద్రం తీపికబురు.. జనవరి 1 నుండే..!

-

కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుందా..? ఇది మధ్య తరగతి ప్రజలకు ఊరట కలగించనుందా..? ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ పెరగచ్చని అంటున్నారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్, కిసాన్ వికాస్ పత్ర స్కీమ్స్ యొక్క వడ్డీ రేట్లు పెరగచ్చని తెలుస్తోంది. అయితే ప్రతి త్రైమాసికం కూడా కేంద్రం ఈ స్కీమ్స్ వడ్డీ రెట్లని మారుస్తూ ఉంటుంది.

ఇప్పుడు దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరం రెపో రేటును 225 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. కనుక వీటిలో కూడా మార్పు రావచ్చని తెలుస్తోంది. అయితే బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లు పెరగొచ్చు. ఈ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లు 2023 జనవరి – మార్చి త్రైమాసికానికి పెరగచ్చని అంటున్నారు.

ఈ స్కీమ్స్ ద్వారా డబ్బులని పొదుపు చెయ్యడానికి అవుతుంది. సేవింగ్స్ డిపాజిట్స్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, మంత్లీ ఇన్‌కమ్ అనే స్కీమ్స్ అందుబాటులో వున్నాయి. నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెట్టచ్చు. అప్పుడు మెచ్యూరిటీ సమయంలో ఆకర్షణీయ రాబడి పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత త్రైమాసికం లో మార్పులు చేసింది. వీటిని పెంచింది. కాని అన్నింటికీ కాదు కొన్ని పథకాలకు మాత్రమే. టైమ్ డిపాజిట్లు, మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్, కేవీపీ, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ ని 10 నుంచి 30 బేసిస్ పాయింట్లు పెంచేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news