బండి సారథ్యంలోనే ఎన్నికలకు..మళ్ళీ అధ్యక్షుడుగా!

-

బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక..రాష్ట్రంలో బీజేపీకి కొత్త ఊపు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే మంచి మంచి విజయాలు బీజేపీ సాధించింది. తెలంగాణలో బీజేపీ బలం పెంచి…బీఆర్ఎస్ పార్టీకి పోటీగా తీసుకురావడంలో బండి కృషి ఎంతో ఉంది. ఓ వైపు కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూ, ప్రజా సమస్యలని అడ్రెస్ చేస్తూ..అక్రమ అరెస్టులు చేసిన సరే ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు.

ఇంకా ఎన్ని విమర్శలు వచ్చిన ప్రత్యర్ధులకు తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలోనూ బీజేపీని బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్నారు. తన పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చారు. ఇక మోదీ, అమిత్ షా పాల్గొన్న బహిరంగ సభలని భారీ స్థాయిలో సక్సెస్ చేసి..మోదీ చేత ప్రశంసలు అందుకున్నారు. ఇలా పార్టీ కోసం నిత్యం కష్టపడుతున్న బండినే మళ్ళీ అధ్యక్షుడుగా కొనసాగించేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయన సారథ్యంలోనే ఎన్నికలని ఎదురుకోవాలని ఫిక్స్ అయ్యారు.

సాధారణంగా మూడేళ్లకు ఒకసారి అధ్యక్షులని మారుస్తారు. 2020 మార్చి 11న బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా సంజయ్‌ బాధ్యతలు చేపట్టారు. అంటే 2023 మార్చిలో ఆయన పదవీకాలం పూర్తవుతుంది. అంటే దాదాపు ఎన్నికల సీజన్ వచ్చేసినట్లే. ఒకవేళ కేసీఆర్ ముందస్తుకు వెళితే..మే లేదా జూన్ లోనే ఎన్నికలు రావచ్చు. లేదా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే డిసెంబర్ 2023.

అంటే ఎక్కువ సమయం లేదు. కాబట్టి ఈలోపు కొత్త నేతని తీసుకొచ్చి, వారికి అధ్యక్ష బాధ్యతలు ఇస్తే..పార్టీలో నేతలు సర్దుకోవడానికే టైమ్ పడుతుంది. అదే బండి నాయకత్వంలో అందరికీ పనిచేయడం అలవాటు అయింది. కాబట్టి బండినే మళ్ళీ అధ్యక్షుడుగా కొనసాగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బండి సారథ్యంలోనే బీజేపీ ఎన్నికలని ఎదురుకునే అవకాశం ఎక్కువ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news