1200 పేజీల చార్జ్ షీట్ నమోదైంది ఎవరిమీదో తెలుసా.

-

ఢిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ పై 1200 పేజీల ఛార్జ్‌షీట్‌ నమోదైంది. కన్నయ్యతో పాటు విద్యార్థి సంఘం నాయకులు ఉమర్‌ ఖలీద్‌, అనీర్బన్‌ బట్టాచార్య పేర్లను కూడా ఛార్జ్‌షీట్‌లో చేర్చినట్లు ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ అమూల్య పట్నాయక్‌ వెల్లడించారు. దేశద్రోహం(124ఎ), క్రిమినల్‌ కుట్ర(120బీ), అలర్లకు ప్రేరేపణ(147), అనుమతి లేకుండా సమావేశం కావడం(143) , తదితర సెక్షన్ల ద్వారా వారిపై అభియోగాలు నయోదు చేశారు. సోమవారం దాఖలైన ఈ చార్జ్ షీట్ పై పాటియాల హౌస్‌ కోర్టు దీనిపై మంగళవారం విచారణ చేపట్టనుంది.

గతంలో పార్లమెంట్‌పై దాడి ఘటనలో సూత్రధారి అప్జల్‌ గురుకు ఉరిశిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ 2016 ఫిబ్రవరి 9న కన్నయ్యతో పాటు పలువురు విద్యార్థి నాయకులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీ తమపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని కన్హయ కుమార్  పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. ఏది ఏమైన ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భాజపా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులపై తమ ప్రతాపం చూపేందుకు అన్ని అవకాశాలను వాడుకుంటున్నట్లు నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news