టాలీవుడ్ లో మోస్ట్ హైప్ ఉన్న మూవీస్ లిస్ట్ లో ఒకటిగా నిలిచినా లైగర్ సినిమా 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది..ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ దర్శకత్వం వహించాడు.
అయితే…ఈ సినిమా మొదటి ఆట నుండే ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ రావడం మూవీ టీం కి పెద్ద షాక్ అని చెప్పొచ్చు. అయితే… భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిన ‘లైగర్’ మూవీ మరో చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఈ సినిమాకు IMDB 10 కి 1.7 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే.. ఇక సినిమా విడుదలైన మొదటి షోకే ఫలితం తెలియడంతో చార్మి తన సన్నిహితుల దగ్గర ఎమోషనల్ అయిందంట.
దాదాపు సినిమా 200 కోట్ల మేర నష్టాన్ని ఇచ్చిందంట చెప్పడం కోసమెరుపు. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉంటూ చార్మి చాలా కష్టపడి ఆస్తులను కూడగట్టి ఇలా లైగర్ రూపంలో పూర్తిగా కోల్పోయినట్టుగా తన సన్నిహితులతో చెప్పి బాధపడుతుందట చార్మి. జనగణమన సినిమాపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా పడే అవకాశాలు ఉండడంతో చార్మి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది.