డబ్బులు సంపాదించడం ఎలా అని చాట్‌ జీపీటిని అడిగాడు.. ఒక్కరోజులో లక్షాధికారి అయిపోయాడు..!

-

కొద్దిరోజులుగా చాట్‌జీపీటి చేస్తున్న అద్భుతాలు మనం చూస్తూనే ఉన్నాం.. కోడింగ్‌ చేయడంలో తనకు సాటి ఎవరు లేరు అని నిరూపించుకుంటుంది. ఎలాంటి ప్రశ్నలకు అయినా అవలీలగా సమాధానం చెప్తుంది. ఏ రంగం వారికి అయినా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇటీవల చాట్‌జీపీటి ఇంకో గొప్పపని చేసింది. డబ్బులు ఎలా సంపాదించాలి అని అడిగిన ప్రశ్నకు చాట్‌ జీపీటి ఇచ్చిన సమాధానంతో ఆ వ్యక్తి ఒక్క రోజుల్లో లక్షలు విలువ చేసే కంపెనీని నిర్మించాడు.. నమ్మడం లేదా.. అసలేం జరిగిందంటే..

Chat Gpt:क्या है चैट जीपीटी? भविष्य में क्या है इसकी संभावनाएं - What Is Chat Gpt What Are Its Future Prospects Know All Details Here - Amar Ujala Hindi News Live

ఈ రోజుల్లో స్టార్టప్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. స్టార్టప్‌లు స్థాపించి కొందరు కొన్ని నెలల్లోనే కోటీశ్వరులు అవుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ఓ వ్యక్తి అద్భుత విజయం సాధించాడు. మరింత డబ్బు ఎలా సంపాదించాలి? అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అయిన చాట్ జీపీటీని(ChatGPT)అడిగాడు. ఈ ప్రశ్నకు చాట్ జీపీటీ ఇచ్చిన సమాధానంతో అతను ఆశ్చర్యపోయాడు. దాని సాయంతో ఈరోజు లక్షల్లో సంపాదిస్తున్నాడు.

Chat GPT Yang Sedang Viral - MATRA

జాక్సన్ ఫాల్ అనే వ్యక్తి తాజాగా తన జీవితంలో జరిగిన అద్భుతమైన విషయాన్ని ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. గేమ్ ప్లేలో నేను ChatGPT-4 AI బాట్‌ని లోడ్ చేశాను. మీ దగ్గర 100 డాలర్లు మాత్రమే ఉంది..కానీ మీ లక్ష్యం తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడం మరియు అది కూడా తప్పు చేయకుండా, అప్పుడు మార్గం ఏమిటి అని చాట్ జీపీటీని అడిగాను. దీనికి చాట్ జీపీటీ ఓ సమాధానం ఇచ్చింది. దీని ద్వారా మీకు కావలసినంత సంపాదించవచ్చు అని ChatGPT తెలిపింది.

జాక్సన్‌ ఆశ్చర్యపోయి.. ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడట..అది చెబుతూనే ఉంది. ముందుగా వెబ్‌సైట్‌ను రూపొందించాలని అని చాట్ జీపీటీ సూచించింది. వెబ్‌సైట్ ఎలా ఉండాలి, ఏయే ఆర్టికల్స్ ఉండాలి అని కూడా చాలా హెల్ప్ చేసింది. చాట్ జీపీటీ తనకు GreenGadgetGuru.com అనే డొమైన్ పేరును కూడా సూచించిందట. ఇది మీకు పర్యావరణం పట్ల అనుబంధాన్ని కలిగిస్తుంది. తర్వాత ఓ గొప్ప లోగోని ఎంచుకుని ఇచ్చింది. బ్రాండింగ్ పద్ధతులను కూడా నేర్పించింది. కస్టమర్ల డిమాండ్ ఉన్న ఉత్పత్తులను మాత్రమే ఉంచాలని చెప్పిందట… ఆ ఉత్పత్తులు ఏంటో కూడా చెప్పేసింది. సోషల్ మీడియాలో పెట్టండి అని సలహా ఇచ్చింది. చాట్ జీపీటీ చెప్పిన మెసేజ్‌లన్నింటినీ జాక్సన్‌ ఫాలో అయ్యాడు..

మార్చి 15న కంపెనీ ఏర్పడిందని, ఒక్క రోజులో కంపెనీ నిలబడిందని జాక్సన్ చెప్పారు. పెట్టుబడి ఎలా వస్తుందో చాట్‌జీపీటీ చెప్పిందని.. ఈ రోజు తన సంస్థకు చాలా మంది పెట్టుబడిదారులు ఉన్నారు, కంపెనీ మార్కెట్ విలువ 25,000 డాలర్లు దాటిందని తెలిపాడు. కంపెనీ వద్ద ప్రస్తుతం 1378.84 డాలర్లు ఉన్నట్లు జాక్సన్ తెలిపాడు. ఇన్వెస్టర్ల నుంచి కాల్స్ రావడం మొదలయ్యాయి. జాక్సన్‌కి ఇది తొలిరోజులే అయినా.. అతని వ్యాపారం సాగుతున్న వేగాన్ని చూస్తుంటే.. త్వరలోనే కోటీశ్వరుడు అవుతాడని చెప్పొచ్చు. ఇలా చాట్‌జీపీటి తన ఇంటిలిజెన్స్‌తో అద్భుతాలు సృష్టిస్తోంది. మీరు కూడా వాడండి..!

Read more RELATED
Recommended to you

Latest news