క్రెడిట్ కార్డు ఈఎంఐ పెట్టుకుంటున్నారా..? అయితే వీటిని మరచిపోకండి..!

-

ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ మొదలవ్వనుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజ ఆన్‌లైన్ రిటైల్ కంపెనీలు అదిరే ఆఫర్స్ ని తీసుకు వస్తున్నాయి. అలానే ఆఫ్ లైన్ లో కూడా ఎన్నో ఆఫర్స్ ని తీసుకు వస్తుంటారు. అయితే వీటిని కొనేటప్పుడు క్రెడిట్ కార్డులపై పేమెంట్స్ ని చేస్తుంటారు.

అయితే అలాంటప్పుడు కొన్ని గుర్తుంచుకోవాలి. క్రెడిట్ కార్డ్స్ ని ఉపయోగించేటప్పుడు 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, 12 నెలల ఈఎంఐ ఫెసిలిటీ ఉంటుంది. అయితే ఇలా సెలెక్ట్ చేసినప్పుడు ఈ విషయాలను మరచిపోవద్దు. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే..

క్రెడిట్ కార్డుపై ఈఎంఐ పెట్టుకుంటే ఎక్స్ట్రా చార్జీలు పడతాయి. వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు, ప్రీపేమెంట్ వంటివి చెల్లించాలి. ప్రాసెసింగ్ ఫీజును ఒకసారి కట్టాలి. ఇది 3 శాతం వరకు ఉంటుంది. అలానే కార్డు జారీ సంస్థ వడ్డీలను కూడా ఛార్జ్ చేస్తుంది.
లాంగ్ టెన్యూర్లకు క్రెడిట్ కార్డు జారీ సంస్థలు తక్కువ వడ్డీని కట్టాలంటారు. కానీ ఎక్కువగా మనం చెల్లించాలి. పేమెంట్ టర్మ్‌ ని సెలెక్ట్ చేస్తే.. ఎంత వడ్డీ చెల్లిస్తున్నారో కాలిక్యులేట్ చేసుకోవాలి. క్రెడిట్ కార్డ్ తో10 వేలను చెల్లించాలంటే… మూడు నెలలకు వడ్డీ రేటు 20 శాతంగా ఉంటుంది. 12 నెలలకు 18 శాతంగా ఉంటుంది. అందుకే 12 నెలలకు మీకు తక్కువ వడ్డీ పడినా ఎక్కువగానే చెల్లించాల్సి ఉంటుంది.
అలానే ఈఎంఐలుగా లావాదేవీలను మార్చితే క్రెడిట్ కార్డు జారీ సంస్థలు ఎలాంటి రివార్డు పాయింట్లను, అదనపు డిస్కౌంట్లను ఇవ్వవు. కనుక ఏ రివార్డు పాయింట్లను, క్యాష్‌బ్యాక్‌లను మీరు మిస్ అవుతున్నారో చూసుకోండి.
ఏదైనా లావాదేవీ చేసి ఈఎంఐగా మార్చుకునేటప్పుడు ట్రాన్సక్షన్ అంత క్రెడిట్ కార్డు లిమిట్ నుండి కట్ అవుతుంది. ఈఎంఐ చెల్లిస్తూ ఉంటే లిమిట్‌కి యాడ్ అవుతూ ఉంటుంది. పూర్తిగా చెల్లించాక రీస్టోర్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news