బ్యాడ్మింటన్‌ వరల్డ్​ ర్యాంకింగ్స్​.. ​సత్తా చాటిన ఇండియన్ ప్లేయర్ ప్రణయ్

-

బ్యాడ్మింటన్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో భారత యువ క్రీడాకారుడు సత్తా చాటాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ తాజాగా ప్రపంచ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇందులో ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్ 16వ స్థానంలో నిలిచాడు.

వరల్డ్‌ టూర్‌ ర్యాంకింగ్స్‌లో (పురుషుల సింగిల్స్‌ విభాగం) ప్రణయ్‌ అగ్రస్థానంలో నిలిచాడు. అంతకముందు 2017 అక్టోబర్ 27న 17 ర్యాంకులో ఉన్నాడు. ఈ సందర్భంగా భారత బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ స్పందిస్తూ.. “జెయింట్ కిల్లర్​.. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత టాప్​ 15 ర్యాంకుల్లోకి వెళ్లబోతున్నాడు” అని ట్వీట్ చేసింది.

మరోవైపు మిక్స్​డ్​ డబుల్స్​లో ఇషాన్ భట్నాగర్, తనీషా క్రాస్టో జీవితకాలపు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. రెండు స్థానాలు ఎగబాకి 33వ ర్యాంకులో స్థిరపడ్డారు. పురుషుల సింగిల్స్ విభాగంలో కిదాంబి శ్రీకాంత్ 12వ ర్యాంకును సాధించాడు. లక్ష్యసేన్​ ఇదే విభాగంలో 9వ స్థిరపడ్డాడు. గాయం కారణంగా ప్రపంచ ఛాంపియన్​ షిప్, జపాన్​ ఓపెన్​కు దూరమైన​ పీవీ సింధు ఒక ర్యాంకు ఎగబాకి 7వ స్థానంలో ఉంది.
మరో ఒలింపిక్ విజేత సైనా నెహ్వాల్​ మూడు స్థానాలు మెరుగుపరచుకుని 33వ స్థానానికి చేరింది. పురుఘల డబుల్స్​ విభాగంలో కామన్​వెల్త్ గేమ్స్​లో గోల్డ్​ మెడల్ సాధించిన చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్​ 8వ స్థానంలో స్థిరపడ్డారు. మహిళల డబుల్స్​లో అశ్విని బోపన్న, ఎన్​ నిక్కిరెడ్డి 28వ స్థానంలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news