ఇంటర్ పరీక్షా ఫలితాలను సులభంగా ఇలా చెక్ చేసుకోండి !

-

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం వేచి చూస్తున్న విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పాలి. నిన్న విద్యాశాఖ అందించిన సమాచారం ప్రకారం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా విడుదల చేసుండాలి. కానీ కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా దాదాపుగా రెండు గంటల ఆలస్యంతో సరిగ్గా రాత్రి 7 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. దీనితో విద్యార్థులు అందరూ మొబైల్స్ చేతిలో పెట్టుకుని రిజల్ట్స్ ను చూడడానికి వెబ్ సైట్స్ ఓపెన్ చేసుకుని మరియు ఇంకొందరు నెట్ షాపుల దగ్గరకు పరుగెడుతున్నారు. అయితే ఫలితాలను చూడడానికి సులభామిన విధానాన్ని ప్రముఖ ఆన్లైన్ యాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

 

వే 2 న్యూస్ అనే యాప్ ను కనుక డౌన్ లోడ్ చేసుకుంటే అందులో టాప్ లో మీ హాల్ టిక్కెట్ నెంబర్ ను ఎంటర్ చేస్తే మీ పూర్తి వివరాలతో పాటుగా రిజల్ట్స్ మీకు దర్శనం ఇస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ మొబైల్ లో ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి.

 

Read more RELATED
Recommended to you

Latest news