ఖుష్బూ కారును ఢీకొన్న కంటైనర్.. తృటిలో పెను ప్రమాదం మిస్

సినీ నటి, ఇటీవలే కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన కుష్బూ పెను ప్రమాదం ఈరోజు బయటపడింది. ఆమె ప్రయాణిస్తున్న కారును కంటైనర్ ఢీకొంది.ఈ ప్రమాదంలో ఆమె సురక్షితంగా బయటపడ్డారు. చెన్నై సమీపంలోని మేల్మరువత్తూర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఒక కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదం గురించి స్వయంగా కుష్బూ ప్రకటించారు. మేల్మరువత్తూర్ వద్ద మేము ప్రయాణిస్తున్న కారును ఒక త్యంకర్ గుద్దింది అని, అయితే మీ అందరి ఆశీస్సులతో సురక్షితంగా బయటపడ్డానని ఆమె తెలిపింది.

కడలూరు సమీపంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో కుష్బూ ప్రయాణిస్తున్న కారు ఓ వైపు పూర్తిగా దెబ్బతింది. దెబ్బతిన్న కారు ఫోటోలు ఖుష్భూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కుష్బూ ప్రయాణిస్తున్న కారు బెలూన్లు వెంటనే తెరుచుకున్నాయి కాబట్టే ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడింది. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారుని, అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమిటో పోలీసులు తెలుసుకునే పనిలో పడ్డారు.