ఇటీవల థాయిలాండ్ లో ఇండియాకు చెందిన చీకోటి ప్రవీణ్ మరియు మరో 83 మంది ఒక మనీ గ్యాంబ్లింగ్ కు పాల్పడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. మొత్తం రూ. 100 కోట్ల వ్యవహారంలో చీకోటి ప్రవీణ్ అండ్ గ్యాంగ్ దొరికిపోయారు. ఇంతకు ముందు చాలా కేసులు ఇతనిపై ఉన్నా సరైన ఆధారాలు దొరకలేదు. దీనితో ఈ కేసు హైదరాబాద్ లో చాలా సంచలనం సృష్టించింది, అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం వీరికి ఈ కేసులో బెయిల్ దొరికింది. ఈ కేసులో ఉన్న ఒక్కొక్కరి నుండి రూ. 10000 జరిమానాగా తీసుకుని బెయిలు ఇచ్చారు.
ఇక బెయిల్ ఇచ్చిన అనంతరం వీరికి తమ పాస్ పోర్ట్ లను ఇవ్వడంతో ఈ రోజు థాయిలాండ్ నుండి తిరిగి ఇండియాకు రానున్నారు. ఇక ఈ కేసులో పట్టుబడిన వారిలో మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ కేసు తర్వాత ఏ విధంగా ముందుకు వెళుతుందో తెలియాల్సి ఉంది.