బ్రేకింగ్: జూనియర్ ఎన్టీఆర్ ను కలిసిన మంత్రి… అసలు కారణం ఇదే !

-

మే నెల 28వ తేదీన దివంగత నటుడు మరియు రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం లో 56 అడుగులు పొడవు ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. కాగా ఈ విగ్రహ ఆవిష్కరణకు రావాలని టాలీవుడ్ స్టార్ హీరో మరియు నందమూరి మనవడు జూనియర్ ఎన్టీఆర్ ను తెలంగాణ రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కలవడం విశేషం. ఇందుకు ఎన్టీఆర్ సైతం సమ్మతం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అనంతరం ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకూడదన్న ఉద్దేశ్యంతో డైరెక్టర్ కొరటాల శివ తో ఒక మంచి మాస్ యాక్షన్ సినిమాను తెరకెక్కించి పనిలో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news