ప్రపంచ విప్లవ యోధుడు చేగువేరా కుమార్తె అలైదా గువేరా, మనవరాలు ఎస్తిఫినా గువేరా హైదరాబాద్‌లో పర్యటించారు. వారికి వామపక్షనేతలు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ రవీంధ్రభారతిలో ఏర్పాటు చేసిన క్యూబా సంఘీభావ సభకు వీరిద్దరూ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చేగువేరాకు రాష్ట్ర ప్రభుత్వం సంఘీభావం ప్రకటించింది.
ఈ కార్యక్రమానికి హాజరైన చేగువేరా కుమార్తెఅలైదా గువేరా మాట్లాడుతూ.. చేగువేరాను టీ షర్టులు, ఫొటోలకు పరిమితం చేయొద్దని, ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. క్యూబాలో విద్య, వైద్యం ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు.
ఈకార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ చేగువేరా సేవలను గుర్తు చేసుకున్నారు. సామ్రాజ్యవాద శక్తులపై పోరాడాలంటూ వామపక్షనేతలు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ప్రజాకవి గోరేటి వెంకన్న.. చేగువేరాపై ఆలయ పించిన పాటలు సభికులను ఆకట్టుకున్నాయి.