ఏపీ నిరుద్యోగులకు అలర్ట్..రెండు వారాల్లో కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు

-

ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నిన్న ఉదయం ప్రాథమిక పరీక్ష జరగ్గా.. APSLPRB ప్రిలిమినరీ కీలను విడుదల చేసింది. ఈ కీలపై అభ్యర్థులకు అభ్యంతరాలు ఉంటే.. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు [email protected]కు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే 4 సెట్ల బుక్లెట్లను APSLPRB వెబ్సైటులో పెట్టింది. కీ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక నిన్న ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించారు. అభ్యర్థులను ఉదయం తొమ్మిది గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు.కేవలం హాల్ టికెట్, పెన్ను మాత్రమే పరీక్షకు అభ్యర్థులకు అధికారులు అనుమతినిచ్చారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, తాజాగా ఈ పరీక్ష ఫలితాలపై కీలక ప్రకటన వచ్చింది. ఈ పరీక్షా ఫలితాలను రెండు వారాల్లో విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news