HCA లో అవినీతి రాజ్యం ఏలుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు బిసిసిఐ మాజీ మధ్యంతర ప్రెసిడెంట్ శివ లాల్ యాదవ్. శివలాల్ యాదవ్, అర్షద్ ఆయూబ్, శేష్ నారాయణ్., మాజీ ఆఫీస్ బేరర్ల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిసిసిఐ మాజీ మధ్యంతర ప్రెసిడెంట్ శివ లాల్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రసిడెంట్ అజార్ తో పాటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇతర సభ్యుల ప్రస్తుత పనితీరు అవినీతి ఆరోపణల తో ఉందని ఆరోపించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో సమస్యలు పేరుకుపోయాయని.. చాలా అవినీతి పేరుకుపోయిందని ఫైర్ అయ్యారు. చర్చించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని.. అజార్ వ్యవహార శైలి వల్ల యువ ఆటగాళ్లు క్రికెటర్ లు చాలా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. అజార్ అనాలోచియమైన నిర్ణయాల వల్ల ఆటగాళ్ల పై ప్రభావం పడుతుందని చెప్పారు. సీనియర్ సెలక్షన్ కమిటీ క్రికెట్ సలహా కమిటీని అజహరుద్దీన్ రద్దు చేశారని.. అజహరుద్దీన్ తన స్వంత సెలక్షన్ కమిటీని నియమించారన్నారు. జూనియర్స్ సెలక్షన్ కమిటీని అజహర్ నియమించి..నియంతృత్వంలా వ్యవహరిస్తున్నాడని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.