దేశంలో డ్రగ్స్ దందాకు అడ్డుకట్టపడటం లేదు. ఎక్కడికక్కడ దాడుల్లో డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. ముంబై రేవ్ పార్టీతో మొదలైన డ్రగ్స్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం ముంబై, చెన్నై ప్రాంతాల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. వీటి మూలాలు హైదరాబాద్ లో ఉన్నట్లు తేలింది. తాజాగా ఈరోజు చెన్నైలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఈసారి డ్రగ్స్ కు చెన్నై అంతర్జాతీయ పోస్టాఫీస్ వేదికైంది. అక్కడే భారీగా డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విదేశాలకు వెళ్తున్న పార్సిళ్లలో భారీగా డ్రగ్స్, సైకోట్రోఫిన్, గంజాయిని పట్టుకున్నారు. చెన్నై నుంచి అమెరికా, కెనాడాకు వెళ్తున్న పార్సిళ్ల లో డ్రగ్స్ ను కనుగొన్నారు. 8 పార్సిళ్లలో 7990 ట్రామడోల్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్లు, 1225 గ్రాముల గంజాయి ప్యాకెట్లను అధికారులు సీజ్ చేశారు. అక్రమ మార్గాల ద్వారా విదేశాలకు డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు. రాబోయే కాలంలో మరిన్ని డ్రగ్స్ దాడులు జరిగే అవకాశం ఉంది. తాజా ఘటనలు దేశంలో సంచలనం కలిగిస్తున్నాయి.