వావ్‌.. దర్బార్ సినిమా చూసేందుకు అక్క‌డ సెల‌వులు ప్ర‌క‌టించార‌ట‌..

-

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం దర్బార్‌. సౌత్‌ స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్‌ అవుతోంది. తెలుగులోనూ ఈ సినిమాను భారీగా ప్రమోట్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌. ఇదిలా ఉంటే.. తమిళనాట రజనీకాంత్ సినిమా రిలీజ్ అంటే అక్కడ అంతా పండుగ వాతావరణం ఉంటుంది. ఇక పండుగ సందర్భంగా ఆయన సినిమా వస్తుందంటే ఆ సందడి మరింతగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి వాతావరణమే తమిళనాట కనిపిస్తుంది.

ఈ సంక్రాంతికి అక్కడ రజనీ సినిమా ఒక్కటే బరిలో ఉండటంతో క్రేజ్ ఒక రేంజ్ లో వుంది. ఈ నెల 9వ తేదీన ‘దర్బార్’ సినిమాను ప్రదర్శించనున్న ప్రతి థియేటర్ దగ్గర పెద్దస్థాయిలో హడావిడి కనిపిస్తోంది. థియేటర్లపై హెలికాఫ్టర్ తో పూల వర్షం కురిపించడానికి అభిమానులు అనుమతులు తీసుకుంటున్నారు. ఇక చెన్నైలోని కొన్ని ప్రైవేటు ఆఫీసులవారు ‘దర్బార్’ రిలీజ్ రోజున సెలవును ప్రకటించారు. మరికొన్ని ఆఫీసుల వారు సెలవును ప్రకటించడమే కాకుండా, ఉద్యోగులకు సినిమా టికెట్లను ఉచితంగా అందజేస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news