చెక్‌ పేమెంట్ మోసాల నుంచి తప్పించాలంటే ఇవి చూడండి..!

-

ఈ మధ్యన కాలంలో మోసాలు ఎక్కువవుతున్నాయి. చాలా మంది మోసాలు వలన నష్ట పోతున్నారు. బ్యాంక్‌ అకౌంట్‌లలోని నగదును కాజేయడానికి చాలా రకాలుగా మోసాలు చేస్తున్నారు. కనుక ఎవరూ కూడా బ్యాంకు అకౌంట్‌, ఏటీఎం కార్డు, ఓటీపీ వంటి వివరాలని ఇతరుల తో షేర్ చేసుకోవద్దు. ఎంత జాగ్రత్తగా ఉంటున్నా కూడా ఈ మధ్యన మోసాలు బాగా పెరిగిపోతున్నాయి.

అలానే ఇప్పుడు నకిలీ బ్యాంక్‌ చెక్‌ ద్వారా క్యాష్ తీసుకునేందుకు కూడా చుస్తునారు. ఇది మోసం అని చెక్ కన్‌ఫర్మేషన్‌ కోసం కాల్ చేస్తున్నప్పుడు తెలుస్తోంది. నకిలీ చెక్కుల ద్వారా జరిగే మొసలి ఆపేందుకు చూస్తున్నారు. ఈ మధ్యనే ఇలా ఒకటి జరిగింది. ఒక వ్యక్తి చెక్ తీసుకుని బ్యాంక్ కి వెళ్లారు. చెక్‌ను తిరస్కరించమని బ్యాంక్ అకౌంట్ హోల్డర్ చెప్పారు.

చెక్ లీఫ్ నకిలీ కాపీని ఎలా మోసగాడి దగ్గరకి వచ్చిందనేది తెలీలేదు. ఇలా మోసాలు ఎక్కువవ్వడం తో కస్టమర్‌ల నుంచి చెక్‌ కనఫర్మేషన్‌ తీసుకోవాలని బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ సూచించింది. పేమెంట్స్‌ కోసం చెక్‌లను సమర్పించిన సమయంలో బ్యాంక్స్ కనుక సంప్రదించలేదు అంటే డబ్బులు పోతాయి. మోసాలు జరుగుతాయి.

కనుక బ్యాంకులు సంప్రదించాలి. 2021 జనవరి 1 నుంచి అన్ని చెక్‌ల పేమెంట్స్‌కు RBI పాజిటివ్ పే విధానాన్ని తీసుకు వచ్చింది. చెక్‌ను జారీ చేసిన వెంటనే దాని వివరాల గురించి బ్యాంక్ బ్రాంచ్‌కు తెలియజేయడానికి కస్టమర్‌కు అవకాశం వుంది. ఇన్టిమేషన్ ఆఫ్‌లైన్‌ లో ఇవ్వచ్చు. లేదంటే రాతపూర్వకంగా లేదా నెట్ బ్యాంకింగ్ లేదా బ్యాంకింగ్ యాప్‌ల ద్వారా కూడా ఇవ్వచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news