ఈ టమాటాలని పండిస్తే రైతులకి మంచిగా ఆదాయం వస్తుంది..!

-

రైతులు మామూలు టమాటా కి బదులు చెర్రీ టమాటాలని పండిస్తే మంచిగా లాభాలు వస్తాయి. ఈ టమాటాలు నాలుగు వందల రూపాయల నుంచి ఆరు గంటల వరకు పలుకుతాయి. అది కూడా కిలోకి. మన దేశంలో మధ్యప్రదేశ్ కి చెందిన చాలా మంది రైతులు వీటిని సాగు చేస్తున్నారు. చెర్రీ టమోటాలను సాగుచేసే రైతులు మంచిగా లాభాలను పొందడానికి అవుతుంది. ఇప్పటికే చాలా మంది రైతులు వీటికి పండిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. మరి ఇక ఈ చెర్రీ టమాటాలకి సంబంధించి పూర్తి వివరాలని చూద్దాం.

ఈ టమోటాలు చాలా చిన్నగా ఉంటాయి. డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ టమోటాలను ఎలా పండించాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. రైతులు చెర్రీ టమాటాలని పండించాలంటే ట్రేలలో విత్తనాలు వేసి అవి మొలకెత్తిన తర్వాత పొలంలో నాటాలి. ఇక ఈ పంటకు నీళ్లు ఎలా ఇవ్వాలి అనేది చూస్తే… డ్రిప్ పద్ధతిలో పంటలకు నీళ్ళు పెడతారు. అలా ఫాలో అయితే చక్కగా పంటలు పండుతాయి. అయితే ఇది హైబ్రిడ్ టమాటాలు.

స్వదేశీ సాంకేతిక తో తయారుచేసిన ఎక్కువ విటమిన్ ఉండే టమోటాలు. మామూలు టమాటాలు ఉత్పత్తి బాగా తగ్గినప్పుడు వీటిని బాగా వినియోగిస్తూ వుంటారు. అయితే మామూలు టమాటాలాగే వీటిని కూడా పండించటం పండించడం పెద్ద కష్టమేమీ కాదు. వీటికి తేమ ఎక్కువగా అవసరం. అలాగే ఇవి ట్రే లో అయినా మొలుస్తాయి లేదు అంటే భూమి పైన కూడా మొలుస్తాయి.

మొక్కల దూరం 60 సెంటీమీటర్లు పొలంలో ఉండేటట్టు చూసుకోవాలి. ఒకటిన్నర నుంచి రెండు మీటర్ల వరకూ దూరం ఉంచాలి. నాట్లు వేసిన వెంటనే నీటిని ఇవ్వాలి. ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా రాబడి పొందొచ్చు. ద్రాక్ష లాగ వీటిని ప్యాకింగ్ చేస్తూ ఉంటారు. పాలీహౌస్ లో ఒక ఎకరంలో 20 టన్నుల వరకు చెర్రీ టమాటాలను పండించవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధర కిలో కి 600 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news