హెల్త్‌ వర్కర్లకు.. చీర కొంగులే మాస్కులా..? : ఫీవర్‌ సర్వేపై షర్మిల ఫైర్‌

-

కరోనా మహమ్మారి కేసులు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో.. నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో… ఫీవర్‌ సర్వేలు నిర్వహిస్తోంది కేసీఆర్‌ సర్కార్‌. అయితే.. కేసీఆర్‌ సర్కార్‌ చేస్తున్న ఈ ఫీవర్‌ సర్వే పై వైఎస్‌ షర్మిల నిప్పులు చెరిగారు. ఇంటింటికి ఫీవర్ టెస్టులు చేసే హెల్త్ వర్కర్ల ప్రాణాలంటే పట్టింపు లేదా ? అని ఆగ్రహించారు.

వాళ్ళ ప్రాణాలు లెక్క లేదా? చీర కొంగులు.. కర్చీఫులు కట్టుకొని సర్వే చేయాల్నా? కనీసం వాళ్లకు మాస్క్ లు, శానిటైజర్ల్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందా ప్రభుత్వం? అంటూ రెచ్చి పోయారు వైఎస్‌ షర్మిల. ప్రజల ప్రాణాల కోసం హెల్త్ వర్కర్లు వారి ప్రాణాలను రిస్క్ లో పెట్టుకొని పనిచేస్తున్న హెల్త్ వర్కర్లకు ..
ఫ్రంట్ లైన్ వారియర్లకు మాస్క్ లు .. శానిటైజర్ల్ తో పాటు .. వారికి ఈ కరోనా కాలంలో జీతంతో పాటు స్పెషల్ బోనస్ ఇవ్వాలని, వారికి కరోనా సోకితే స్పెషల్ ట్రీట్మెంట్ .. ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news