నిర్మల సీతారమన్ ను పార్లమెంట్ సాక్షిగా నిలదీస్తాం – టీఆర్‌ఎస్‌ ఎంపీ

-

కేంద్ర మంత్రి నిర్మల సీతారమన్ పై ఫైర్ అయ్యారు చేవెళ్ళ టీఆర్‌ఎస్‌ పార్టీ ఎం.పి రంజీత్ రెడ్డి. అయుష్ మాన్ భారత్ లో కేంద్ర, రాష్ట్రాల వాటా ఎంత అని ఓ ఐఏఎస్ అధికారిని ప్రశ్నించడం తప్పు అని మండిపడ్డారు. తెలంగాణ లో కేంద్ర మంత్రులు సైతం నీచమైన, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. త్వరలోనే వారికి తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు.

సీతా రామన్ ను పార్లమెంట్ సాక్షిగా నిలదీస్తాం. సభలో వివిధ అంశాలపై వారి ఇస్తున్న జవాబులకు వారు ప్రవర్తిస్తున్న తీరు ఏలా ఉందో ప్రజలు గ్రహిస్తారని వెల్లడించారు. సీతా రామన్ తప్పుగా మాట్లాడారు కాబట్టే మీడియా ముందుకు రాలేదు. పార్లమెంట్ సాక్షి గా చాలా సార్లు కేంద్ర, రాష్ట్రాల వాటా ఎంత అని ప్రశ్నించినా మంత్రులు దాట వేశారని పేర్కొన్నారు. రూ. 3500 కోట్లు ఖర్చు పెడుతున్నామంటున్న కేంద్రం దానికి సంబంధించిన సాక్షాలు చూపించాలని డిమాండ్ చేశారు రంజీత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు పారేసుకుంటున్న బీజేపీ నాయకులకు పార్లమెంట్ లోనే జవాబు చెబుతామని వార్నింగ్‌ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news