‘బ్ర‌హ్మ‌స్త్ర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్.. మేకర్స్​ అన్ని కోట్లు న‌ష్ట‌పోయారా?

-

ప్ర‌స్తుతం ఉత్తరాది హీరోలు తెలుగులో మార్కెట్ పెంచుకునే ప‌నిలో ఉన్నారు. ముఖ్యంగా తెలుగులో కంటెంట్ బాగుంటే భారీగా క‌లెక్ష‌న్లు సాధించొచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు నేరుగా తెలుగు వెర్ష‌న్‌లోనే సినిమాల‌ను డ‌బ్ చేస్తున్నారు. అయితే ఈ మ‌ధ్య విడుద‌లైన ‘పృథ్విరాజ్’, ‘లాల్ సింగ్ చ‌డ్డా’, ‘షంషేరా’ వంటి సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అంత‌గా వ‌సూళ్ళు సాధించ‌లేక‌పోయాయి. ఇక‌ షంషేరాతో భారీ ప‌రాజ‌యాన్ని మూట గ‌ట్టుకున్న ర‌ణ్‌బీర్ ఇప్పుడు ‘బ్ర‌హ్మ‌స్త్ర‌’తో ఎలాగైనా తెలుగులో భారీ విజ‌యం సాధించాల‌ని ఆరాటపడుతున్నారు. అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని తెలుగులో రాజ‌మౌళి విడుద‌ల చేస్తున్నాడు.

ఇప్పటికే చిత్రం బృందం విడుద‌ల చేసిన ట్రైలర్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. అలానే క్రిటిక్స్​ను ఎదుర్కొంది. ఫాంట‌సీ అడ్వేంచ‌ర్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 9న విడుదల కానుంది. ఈ క్ర‌మంలోనే మేక‌ర్స్ హిందీతో పాటు తెలుగులో కూడా జోరుగా ప్ర‌మోష‌న్‌లు జరుపుతున్నారు. ఇప్ప‌టికే వైజాగ్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌కు తెలుగు ప్రేక్ష‌కుల నుంచి విశేష స్పంద‌న వ‌చ్చింది. ఈ నేపథ్యంలోనే రాజ‌మౌళి తెలుగులో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జ‌రపాల‌ని ప్లాన్ చేశారు.

రామోజీఫిలిం సిటీలో భారీగా అత్యంత గ్రాండియ‌ర్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జ‌రుపాల‌ని రాజ‌మౌళి ప్లాన్ చేశారు. దానికి త‌గ్గట్టే సెట్‌ను కూడా నిర్మించారు. ఇక‌ ఈ వేడుక‌కు ఎన్టీఆర్‌ను గెస్ట్‌గా పిలిచారు. కానీ చివ‌రి నిమిషంలో పోలీస్‌ల నుండి ప‌ర్మిష‌న్ రాక‌పోవ‌డంతో ఈవెంట్‌ను క్యాన్సిల్ చేశారు. ఈ క్ర‌మంలో పార్క్ హ‌య‌త్ హోట‌ల్‌లో బ్ర‌హ్మ‌స్త్ర టీం ప్రెస్ మీట్‌ను నిర్వ‌హించింది. ఎన్టీఆర్ గెస్ట్‌గా వ‌చ్చి సినిమాను ప్ర‌మోట్ చేశారు.

అయితే రామోజీఫిలిం సిటీలో జ‌ర‌గాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మేక‌ర్స్ దాదాపు రూ.2.25 కోట్లు ఖ‌ర్చుపెట్టార‌ట‌. అంత మొత్తం ఖ‌ర్చు పెట్టి.. చివ‌రి నిమిషంలో ఈవెంట్ క్యాన్సిల్ అవ‌డంతో మేక‌ర్స్‌ కాస్త నిరాశ‌ప‌డ్డార‌ట‌. ఇక‌ పార్క్‌ హ‌య‌త్ ప్రెస్ మీట్ కోసం సుమారు 10ల‌క్ష‌లు ఖ‌ర్చ‌య్యాయ‌ట‌.

మైథ‌లాజిక‌ల్ అడ్వెంచ‌రస్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రం మూడు భాగాలుగా తెర‌కెక్క‌నుంది. బిగ్‌బీ అమితాబ్, నాగార్జున‌ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించ‌గా మౌనీరాయ్ విల‌న్ పాత్ర‌లో న‌టించింది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌, ప్రైమ్ ఫోక‌స్‌, స్టార్ లైట్ పిక్చ‌ర్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

Read more RELATED
Recommended to you

Latest news