ఎన్నికల కోసమే ముఖ్యమంత్రి హడావిడి చేస్తున్నారు – కోదండ రెడ్డి

-

ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ హడావిడి చేస్తున్నారని మడిపడ్డారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. అధికారులు రికార్డులు సరిగా లేకుండా చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా సర్వే జరగలేదన్నారు. అదే ఏపీలో జూలై ఒకటి నుండి భూ సర్వే జరుగుతుందని.. డ్రోన్ ఫోటోల ద్వారా గ్రామ నక్ష కూడా పూర్తయింది అన్నారు.

ప్రతి గ్రామపంచాయతీలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి, రెవెన్యూ రికార్డులు సరిదిద్దడం కోసం రెండు లక్షల సిబ్బందిని నియమించారని తెలిపారు. కానీ తెలంగాణలో పూర్వీకులు సంపాదించుకున్న భూమి కూడా ఇంతవరకు ఖాతాలలో ఎక్కలేదని ఆరోపించారు. ధరణి పోర్టల్ ఏర్పాటు చేసి విదేశాలలో దివాలు తీసిన ఓ కంపెనీకి ధరణి నిర్వహణను అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

2017 డిసెంబరు లో భూ రికార్డుల సవరణ చట్టాన్ని తెలంగాణలో తీసుకువచ్చారని.. ఐదేళ్లు గడిచిన 20 లక్షల కుటుంబాలకు భూమి హక్కు లభించలేదన్నారు. ఈ ముఖ్యమంత్రి కి ఎన్నికల ముఖ్యమని.. వ్యవసాయ రంగాన్ని చిన్న భిన్నం చేశారని మండిపడ్డారు. పోడు భూములపై ఇంతవరకు రిపోర్టు బయటికి రాలేదన్నారు కోదండ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news