అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేసి, వెట్టిచాకిరీ నుండి చిన్నారులను రక్షించి వారి బాల్యాన్ని కాపాడుదామని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిపాలన విభాగం అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ పిలుపునిచ్చారు. ఈనెల 1 నుండి ప్రారంభమైన ఆపరేషన్ స్మైల్ 8 విడతలో భాగంగా హన్మకొండ, వరంగల్, జనగాం జిల్లాలకు చెందిన చైల్డ్ వెల్ఫేర్, చైల్డ్ ప్రొటక్షన్, లేబర్ విభాగం అధికారులతో ఆయన ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.