డ్రగ్స్‌ వాడకంలో ఇక సినిమా వాళ్లు దొరికితే బొక్కలో వేస్తాం : హైదరాబాద్ సీపీ

-

డ్రగ్స్ వాడకంపై హైదరాబాద్ సీపీ సీ వీ ఆనంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు…డ్రగ్స్‌ వాడకంలో ఇక సినిమా వాళ్లు దొరికితే బొక్కలో వేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు హైదరాబాద్ సీపీ ఆనంద్‌. డ్రగ్స్ కేసులో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వున్నారా అన్న ప్రశ్నకు.. ఇకపై వాళ్లకు మినహాయింపు వుండదు అని సీపీ సమాధానం ఇచ్చారు. డ్రగ్స్ వాడకం నగరం లో ఇంటి, ఇంటి సమస్యగా మారుతుందని… డ్రగ్స్ వాడే వాళ్ళను కట్టడి చేయనంత కాలం.. దీన్ని అరికట్టలేమని పేర్కొన్నారు హైదరాబాద్ సీపీ సీ వీ ఆనంద్.

దేశ వ్యాప్తంగా డ్రగ్స్ దందా చేస్తున్న డ్రగ్స్ కింగ్ పిన్ టోనీని అరెస్ట్ చేశామని.. గత వారం రోజులు నుండి ముంబై లో టాస్క్ ఫోర్స్ టీమ్ మకాం వేసి అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు. ఇబ్రాన్ బాబు షేక్ అరెస్ట్ అయిన వెంటనే వాట్సప్ చాట్ డిలీట్ చేశాడని… కాల్ లిస్ట్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని ఎట్టకేలకు టోనీ నీ అరెస్ట్ చేశామన్నారు. 2013 లో వీసా పై నైజేరియా నుండి ముంబై కి వచ్చాడు, వీసా ముగిసిన కూడా ముంబై లోనే ఉంటున్నాడని.. గార్మెంట్ బిజినెస్ చేస్తూ , టోనీ సహచరులు చెప్పడం తో డ్రగ్స్ దందా చేస్తూ వస్తున్నాడని ఆయన వివరించారు. హైదరాబాద్ కి చెందిన ఇంబ్రాన్ బాబు షేక్ , నూర్ మహమ్మద్ ఖాన్, తో కలిసి ఈ డ్రగ్స్ దందా చేస్తున్నారన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news