200 కోట్లతో బాలయ్య “అఖండ” విజయం…!

-

నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా అఖండ. ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. తమన్ స్వరాలు సమకూర్చారు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమా విడుదలై నేటికి 50 రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా కీలక ప్రకటన చేసింది.

50 రోజుల్లో ఈ సినిమా 150 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్టు చిత్రయూనిట్ పేర్కొంది. అయితే థియేట్రికల్ బిజినెస్ తో కలిపి ఈ చిత్రం 200 కోట్ల క్లబ్ లో చేరినట్టు ప్రకటించింది. 103 థియేటర్లలో ఈ సినిమా 50 రోజులు ఆడినట్టు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. అంతేకాకుండా బాలయ్య కెరీర్ లో 200 కోట్లను రాబ‌ట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇప్పటికే బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ లాంటి సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ అఖండ‌తో హ్యాట్రిక్ కొట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news